ఆసుపత్రి మరమ్మత్తు పనులు సకాలంలో పూర్తి చేయాలి తబితం ఆశ్రమ భవన నిర్మాణ పనులకు తిపాదనలు సమర్పించాలి బాల సదనం పిల్లలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలి*lరామగుండం, పెద్దపల్లి లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
జనం న్యూస్ ,మార్చి- 19, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) చివరి ఆయకట్టు మంథని వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం, పెద్దపల్లి ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు, ప్రస్తుత ఆసుపత్రిలోని అంతర్గత మరమ్మత్తు పనులను, రామగుండం వీర్లపల్లి లోని ఈశ్వర కృప వృద్ధాశ్రమం, తబితం ఆశ్రమం, పెద్దపల్లి మండలం అప్పన్న పేట వద్ద ఎస్సారెస్పీ కాలువ, పెద్దపెల్లి పట్టణంలోని కూనారం రోడ్ సమీపంలో గల బాల సదనం భవనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, గోదావరిఖని జనుల ఆసుపత్రిలో వస్తున్న రోగులు వారికి అందుతున్న సేవలు వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఆసుపత్రి భవన నిర్మాణ పనులు, ఆస్పత్రి లోపల చేపట్టిన అంతర్గత మరమ్మత్తు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ శించారు.గోదావరిఖని లోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో*l వృద్ధులకు అవసరమైన వస్తువుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అన్నారు.అనంతరం రామగుండం లోని తబిత ఆశ్రమాన్ని పరిశీలించి తబిత ఆశ్రమంలో ఆగిన భవన నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారి ను ఆదేశించారు.పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామంలో ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఎస్సారెస్పీ నుంచి విడుదలయ్యే నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని,చివరి ఆయకట్టు మంథని వరకు సాగు నీరు చర్యల అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన సాగునీటి సరఫరా లో ఎలాంటి అవాంతరాలు ఉండటానికి వీలు లేదని కలెక్టర్ అధికారులకు చించారు.పెద్దపల్లిలోని బాలసదనం ప్రారంభించిన మూడు నెలల సమయంలోనే 18 మంది పిల్లలు చేరడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బాల సదనంలోని పిల్లలకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని, పిల్లలు సంతోషంగా గడిపేందుకు వీలుగా అవసరమైన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్, ఈఈ నీటి పారుదల శాఖ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.