విద్యార్థులు విద్యలో రాణించాలి - డీ ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి జనం న్యూస్, మార్చి 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బురుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సంస్థలైన లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ,టి వై ఆర్ ఫౌండేషన్, సహకారంతో ఏర్పాటు చేసిన నూతన ఇంగ్లీష్ ల్యాబ్, లైబ్రరీని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు, అనంతరం మాట్లాడుతూ త్వరలో జరగబోవు వార్షిక పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా రాయాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బాగా చదివి మంచి ఫలితాలను సాధించాలని, అదేవిధంగా జీవితంలో ఒక మంచి లక్ష్యం పెట్టుకొని దానిని సాధించుటకు నిరంతరం కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఫాస్ట్ ప్రసిడెంట్ సత్యనారాయణ,పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, రఫీక్, అర్జున్, కవిత, ప్రసన్నలక్ష్మి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి, ఉపాధ్యాయులు పోచయ్య, స్వామి, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.