జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. స్వతంత్ర సమరయోధుడు కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ 94వ స్మారక క్రీడా పోటీల్లో భాగంగా ఈరోజు ధర్పల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికులకు పోటీ నిర్వహించడం జరిగింది 10 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ బీడీలు చుట్టుతారో వారు గెలుపొందుతారని చెప్పడం జరిగింది. పోటీలను ఉద్దేశించి సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య మాట్లాడుతూ ఎక్కడైతే పోటితత్వం ఉంటుందో అక్కడ మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు ప్రతి పనిలో పోటీ అలవర్చుకోవాలని అన్నారు క్రీడా పోటీల వలన స్నేహభావం పెరుగుతుంది. ఆరోజు భగత్ సింగ్ స్వతంత్రం కోసం పోరాటంలో కీలకపాత్ర వహించారు తనకోసం తాను బతకకుండా భారత ప్రజల కోసం పోరాడి ఉరికంబానీ చిరునవ్వుతో ఎక్కినటువంటి భగత్ సింగ్ అతను ఆశించిన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందు బాగానా ఉండాలని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వేముల పద్మ ప్రగతిశీల యువజన సంఘం మండల అధ్యక్షులు మలికి సంజీవ్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ అఖిలభారత రైతుకుల సంఘం మండల అధ్యక్షులు గంగారం వెంకటి తదితరులు పాల్గొన్నారు.