జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి:- ఎస్కే ఖాదర్ బాబా (జనం న్యూస్)మార్చి18 కల్లూరు మండల రిపోర్టర్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టియుడబ్ల్యూజే ఐజేయు ఖమ్మం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఎస్కే ఖాదర్ బాబా అన్నారు. మంగళవారం ఆయన పట్టణ కేంద్రంలో జర్నలిస్టులకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ కమిటీ సభ్యత్వాలు అందించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా అనేక సంవత్సరాల నుంచి పని చేస్తూ ప్రభుత్వం నుంచి రావలసిన రాయితీలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అక్రిడిటేషన్ కార్డులు వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించాలని కోరారు. మండలంలో పనిచేస్తున్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టు టియుడబ్ల్యూజే(ఐజేయు )కమిటీ నందు సభ్యత్వం తీసుకోవాలని కోరారు. తమ సభ్యత్వం కొరకు 630 5929 199 , 9866655654నంబర్‌ను సంప్రదించి సభ్యత రుసుము చెల్లించి రసీదు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ బాధ్యులు సతీష్, శ్రీకాంత్, నియోజకవర్గ కమిటీ బాధ్యులు ధర్నాసి బాలరాజు, వేము రాంబాబు, కోట పుల్లయ్య, జర్పుల సురేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.