బిచ్కుంద మార్చి 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల సిర్ సముందర్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం చేయడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలైన 5లక్షల రూపాయల సీసీ రోడ్డును గ్రామ మాజీ సర్పంచ్ గంగాధర్ పటేల్ ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో గంగాధర్ తో పాటు ప్రవీణ్ పటేల్, భూమప్ప పటేల్, విశాల్ పటేల్, మారుతి, గ్రామ పెద్దలు ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.