వేసవి కాలం లో ఎండలు తీవ్రంగా ఉన్నందున నీటి ఎద్దడి నివారించే చర్యలు తీసుకోవాలని ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 30000 నష్టపరిహారం చెల్లించాలి సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగర్జున రెడ్డి జనం న్యూస్ మార్చి 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తహశీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మునగాల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. పాలకులు మారిన పాలించే పద్ధతి మారలేదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అధికారలో కీ వచ్చి 14 నెలలు అవుతున్న 6 గ్యారెంటీలు నెటికి అమలుకు నోచుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు, మహిళల ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు,రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతువు పెన్షన్, ఉపాధిహామీ పనితో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12 వేల రూపాయలు చెల్లించాలి రైతు రుణమాఫీ రైతు బంధువు రైతు భరోసా, తో పాటు సన్నధాన్యానికి బోనస్ ప్రకటించాలని, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మునగాల తహసిల్దార్ ఆంజనేయులు కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం షేక్ సైదా,జె విజయలక్ష్మి, చందా చంద్రయ్య, డి వెంకట్ రెడ్డి, బి ఉపేందర్, ఎన్ సైదులు, టీ సతీష్, ఆర్ లింగయ్య, ఎస్ పిచ్చయ్య, ఎస్ నరసయ్య, జి వినోద్, ఆరే శేఖర్ రెడ్డి, బి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.