జనం న్యూస్ జనవరి 14(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఉరవకొండ నియోజకవర్గంరాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైన పండుగని, మూడు రోజులపాటు నిర్వహించుకునే ఈ పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని కోరుకున్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారని, మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుందని, ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారన్నారు. సంక్రాంతిని ప్రజలంతా మూడు రోజులపాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారన్నారు. సంక్రాంతి పండుగను మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుందని, ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారన్నారు. ప్రజలంతా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో,ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మంత్రి తెలియజేశారు