ఎస్సీ వర్గీకరణచేసిన తర్వాతనే గ్రూప్ 1, 2, 3 ఉద్యోగ నియమాకాలను నిలుపుదల చేయాలి" జనం న్యూస్ మార్చి 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ నియమాకాలను నిలుపుదల చేయాలని,6 వ రోజు మంగళవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యం నిరసన దీక్షలుచేపట్టారు,ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ & మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ,అధ్యక్షతన లంజపల్లి శ్రీనుమాదిగ, ఆరో రోజు దీక్షలను ప్రారంభించారు,ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి.జిల్లా ప్రధాన కార్యదర్శులు కొత్తపల్లి అంజయ్య మాదిగ,పాతకోట్ల నాగరాజు మాదిగలు మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ వర్గీకరణ చేయకుండా రిజర్వేషన్లు కేటాయించకుండా ఉద్యోగ నియామక ఫలితాలను విడుదల చేయడంతో మాదిగ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాతనే ఉద్యోగ నియమాకాలను చేపట్టాలని,అప్పటివరకు ఫలితాల విడుదలను నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం దీక్ష విరమణ కార్యక్రమానికి బీసీ యువజన సంఘం కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్ హాజరై మాట్లాడారు.. ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదని, బీసీ సంఘం నుండి పూర్తి మద్దతు ప్రకటిస్తూ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో,ఎమ్మార్పీఎస్ మండలఅధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ,మాజన సోషలిస్టుపార్టీమండలఅధ్యక్షులు లంజపల్లి శ్రీనుమాదిగ, ఎమ్మార్పీఎస్ మండలనాయకులు జిల్లేపల్లి ఎల్లేశ్వరావు, మాస్టిన్ సంఘంమండలఅధ్యక్షులు దర్శనం గోపి,ఉపాధ్యక్షులు దర్శనం
వెంకన్న,నాగేల్లి శ్రీను,దర్శనం రాంబాబు,పొన్నాల ప్రవీణ్, దర్శనం చిన్న గోపి,నాగెల్లి సాయికుమార్, ఎస్టి నాయకులు బాలునాయక్, ఎం.ఎస్.ఎఫ్.విద్యార్థి సంఘం నాయకులు కంభంపాటి సంతోష్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.