జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం రైల్వే GRP పోలీస్ స్టేషన్ ను విశాఖపట్నం DSP రామచంద్రరావు మంగళవారం పరిశీలించారు. ముందుగా పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. విజయనగరం రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, అక్రమ గంజాయి రవాణా తదితర అంశాలపై సిబ్బందితో చర్చించారు. ట్రైన్లో జరిగే నేరాలపై తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు.