జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలోని మంగళ వీధిలో పేకాట స్థావరంపై ఒకటవ పట్టణ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం సీఐ శ్రీనివాస్‌కు రావడంతో, ఎస్సై ప్రసన్నకుమార్ తన సిబ్బందితో దాడులు చేపట్టారు. పేకాట ఆడుతున్న పదిమందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.11,481 నగదు 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.