బనగానపల్లె జనం న్యూస్ జనవరి 13
బనగానపల్లె మండలం పలుకూరు గ్రామం పాఠశాల గ్రౌండ్ నందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో నడక యొక్క విశిష్టతను గురించి కరపత్రం ఆవిష్కరణ పంపిణీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా కరపత్రాన్ని ఆవిష్కరించిన బ్రహ్మానంద చారి అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ నడకతోనే ఆరోగ్య సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు ప్రతి ఒక్కరు తమ విలువ సమయంలో ఒక గంట అయినా నడిచి తమ ఆరోగ్యానికి కాపాడుకోవాలని కోరారు మధ్యకాలంలో షుగరు గ్యాసు బిపి గుండెజబ్బులు క్యాన్సర్ తదితర వ్యాధుల నుంచి మనం విముక్తులు కావాలంటే తప్పకుండా ఒక గంట అయినా నడవాలని బ్రహ్మానంద చారన్నారు ప్రతి విద్యార్థి ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకే కాకుండా పదిమందికి తెలిపి ఆరోగ్య నిర్మాణ సమాజంలో భాగస్వాములు కావాలని బ్రహ్మానంద చారి కోరారు ఈ కార్యక్రమంలో విజయ్ మధు వెంకటేష్ రాజా పలుకూరు వాకింగ్ మిత్ర బృందం పాల్గొన్నారు అనంతరం కరపత్రాలు పంపిణీ చేయడం జరిగినది