జనం న్యూస్ -మార్చి 20- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో బుధవారం నాడు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో యూకేజీ విద్యార్థులు పాల్గొన్నారు చిన్నారులు ప్రత్యేక దుస్తులు ధరించి అందరిని ఆకట్టుకున్నారు యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ జానీస్ చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ అంకితభావం పట్టుదల ముఖ్యమైనవని అన్నారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ స్నేహలత, ఉపాధ్యాయులు రాధా మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.