జనం న్యూస్ మార్చి 19 నడిగూడెంనడిగూడెం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయం నందు ఏపీఎం రామలక్ష్మి అధ్యక్షతన మండల మహిళా సమాఖ్య అధ్యక్షులకు, వివో, వివోఏ లతో బుధవారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో ఎస్ఐ అజయ్ కుమార్ మహిళా సమాఖ్య సభ్యులకు మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం, సైబర్ ఆధారిత అక్రమ రవాణా వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీసీ సాంబయ్య, మహిళా సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.