జనం న్యూస్ మార్చి 19 కాట్రేనికొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) రేషన్ కార్డులో పేరు నమోదైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను చేయించుకోవాలని తహసిల్దార్ పీ. సునీల్ కుమార్ పేర్కొన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం వీఆర్వోలు మరియు రేషన్ డీలర్లతో ఈ కేవైసీ ప్రక్రియపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ నిలిచిపోవడంతో పాటు వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా లభించే అవకాశం లేదన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ ఈకేవైసీని చేయించుకోవాలన్నారు. దీని కొరకు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల్లోనూ ఈపాస్ మిషన్ల ద్వారా ఈ కేవైసీ చేయడం జరుగుతుందన్నారు. ఇవి కాకుండా మీ సేవ, ఆధార్ కేంద్రాల్లోనూ చేయించుకోవచ్చని సూచించారు. నేటినుండి ఈ నెల కరువు వరకు ఈ ప్రక్రియ ను వేగవంతంగా చేయడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలని సునీల్ కుమార్ సూచించారు.