ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభలో చట్టబద్ధంగా ఆమోదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు లిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రత్నాకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిసి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం.. టపాసులు కాల్చి స్వీట్లుపంచి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. జనం న్యూస్ 19 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్.) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం వర్గీకరణ పోరాట చరిత్రలో ఎంతోమంది అమరులై వారి త్యాగాల వలన చారిత్రాత్మక విజయానికి బాటలు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం రోజున మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధంగా ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాలు వర్గీకరణ పోరాటంలో ఎంతోమంది అమరులైనారని ఇకనుండి ఎలాంటి మరణాలు జరగద్దని ఉద్దేశంతో సుప్రీంకోర్టులో న్యాయమైన డిమాండ్ గా ఎస్సీలను వర్గీకరించుకోవచ్చన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసానంగా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తామని చెప్పక ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీలను వర్గీకరించి అందరికీ సమన్యాయం చేస్తానని చెప్పిన మాట ప్రకారము శాసనసభలో చట్టబద్ధంగా ఆమోదం తెలిపే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసి చిత్తశుద్ధి చాటుకుందని అన్నారు ప్రజా ప్రభుత్వం ఎప్పటికీ ప్రజల వైపే ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి తో పాటు మాజీ మండల అధ్యక్షులు సుకినే సంతాజి సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎల్తూరి రత్నాకర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బొల్లె పోగు రమేష్ పాక రమేష్ యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు అంబాల స్వామి ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ అంబాల రమేష్ గోడిశాల అర్జున్ గౌడ్ చిలుముల వినోద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు