జనం న్యూస్ 20మార్చి పెగడపల్లి ప్రతినిధి మల్లేశం పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన ఐలవేణి రంజిత్ కుమార్ వయసు 16 సంవత్సరాలు ప్రస్తుతం పెగడపల్లి మోడల్ స్కూల్ నందు పదవ తరగతి చదువుతున్నాడు ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం స్కూల్ కి వెళ్లి మధ్యాహ్నం 13.30 గంటల సమయంలో స్కూల్ సమయం ముగించుకొని రంజిత్ మరియు తన స్నేహితుడైన శివరాత్రి శివ యొక్క హోండా షైన్ బైక్ పై ఇద్దరు పెగడపల్లి వస్తుండగా మార్గమధ్యంలో సబ్స్టేషన్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గరికి చేరుకునే సమయానికి కరీంనగర్ తీగల గుట్టపల్లికి చెందినటువంటి 1)నవీన్ కుమార్ 2)ఆరేపల్లి అనిల్ 3)గసిగంటి వర్ధన్ మరియు మైస అజయ్ అను నలుగురు 4)వ్యక్తులు తెలుపు రంగు TS 09 EP 4569 కారులో వచ్చి ఐలవేణి రంజిత్ కుమార్ నవీన్ కుమార్ కి చెందినటువంటి పెంపుడు కుక్కని దొంగిలించాడనే అనుమానంతో ఐలవేణి రంజిత్ కుమార్ ని బలవంతంగా వారి యొక్క కారులో ఎక్కించుకొని కరీంనగర్ వైపు వెళుతుండగా తన స్నేహితులైన శివరాత్రి శివ అట్టి సమాచారాన్ని స్కూలు యాజమాన్యానికి మరియు రంజిత్ కుమార్ బంధువులకు తెలియజేయగా రంజిత్ కుమార్ తండ్రి అయిన ఐలవేణి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గంటల వ్యవధిలోని ఎస్సై సిహెచ్ రవికిరణ్ మరియు వారి సిబ్బంది అయినటువంటి కానిస్టేబుల్ వెంకటరెడ్డి రవీందర్ మరియు శ్రీనివాసులు వెళ్లి ఆ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి కారుని సీజ్ చేసినట్లు మరియు బాలుడు రంజిత్ కుమార్ ని వారి తల్లిదండ్రులకు అప్పచెప్పినట్లు పత్రిక ప్రకటనలో తెలిపినారు.