జనం న్యూస్ మార్చ్ 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్య రంగానికి కేవలం 7. 56% నిధులు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యుఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంకుల తిరుపతి మాట్లాడుతూ..గత ప్రభుత్వాన్ని పదేపదే విమర్శిస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసింది అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు విద్యారంగానికి వారి బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని చెప్పి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి రాంగానే కెసిఆర్ చెప్పిన అబద్ధపు మాటల పద్ధతిలోనే ఈయన పాలన కూడా కొనసాగిస్తున్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యావ్యవస్థ పై చిత్తశుద్ధి ఉంటే వాళ్లు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించేలా చర్యలు చేపట్టాలి. కానీ దానికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి కేవలం 23. 108 (7.57%) నిధులను మాత్రమే కేటాయించడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఈ బడ్జెట్ తో విద్య అభివృద్ధి కాదు కదా పాత బకాయిలు చెల్లించడానికి కూడా సరిపోవు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని వారి ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వేర్యం అవుతుంది. ప్రభుత్వ పాఠశాల విద్యా నుంచి మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు కనీసం ప్రాథమిక సౌకర్యాలు లేని స్థితి ఇయ్యాల రాష్ట్రంలో కొనసాగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యారంగం పట్ల స్పష్టమైన చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక యూనివర్సిటీ కేటాయిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి హామీ ని కూడా అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించక పోవడానికి చూస్తుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై కూడా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. కావున ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించి విద్యారంగానికి 20 శాతం నిధులను వెంటనే కేటాయించాలని లేనిపక్షంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలతో పాటుగా చలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి, పిడిఎస్యు పట్టణ నాయకులు పులి సుశాంత్, పులి రామ్ చరణ్ తేజ్, దర్శన్ అజయ్, దాగం వినయ్, కర్రె అరుణ్ కుమార్, విలాస్ తదితరులు పాల్గొన్నారు