జనంన్యూస్. 20. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చేసే అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ. అని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి విమర్శించారు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ తమ స్థాయికి మించి మాట్లాడడం సరికాదని ఈ సందర్భంగా భాకారం రవి హెచ్చరించారు నియోజకవర్గాన్ని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే మీద లేనిపోని ఆరోపణలు చేయడం దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా కులగణధర 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడడం దేశ చరిత్రలోనే తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడడం ఇది మొదటి అడుగు అని తెలిపారు.అన్ని వర్గాల అభివృద్ధి కీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని తెలిపారు. మేము బిజెపి వారికి ఒకటే ఒక ప్రశ్న..? అడుగుతున్నాం మీరు పరిపాలిస్తున్న సుమారు 17 నుండి 18 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉండొచ్చు ఎక్కడైనా మీరు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారా ఆలోచించుకోవాలి అని సిరికొండ మండల కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. తెలంగాణ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎర్రన్న. సంతోష్ నాయక్.సొసైటీ చైర్మన్ గంగాధర్. వైస్ చైర్మన్ నరసయ్య మండల నాయకులు నర్సారెడ్డి. రాములు.రామ్ రెడ్డి.రిక్క ముత్తెన్న.గొల్ల జనార్దన్. దిగంబర్. సంతోష్. రమేష్. తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.