జనం న్యూస్ // మార్చ్ // 20 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణ లో బ్యాంకు మోసాలు, మరియు ఏటీఎం లో దొంగతనాలు జరుగుతున్న సందర్భంలో ప్రజలు ఎల్లప్పుడూ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి తెలిపారు. ప్రజలకు సంబంధించిన మొబైల్ ఫోన్లు ఏటీఎం,, పిన్ నెంబర్లు, ఓటిపి, పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయకూడదు అని తెలిపారు. అలాగే తెలిసిన వారికి కూడా ఏటీఎం కార్డులు ఇవ్వకూడదన్నారు. పిన్ నెంబర్లు రహస్యంగా ఉంచుకోవాలని సూచించారు. ఏటీఎం పిన్కోడ్ టైప్ చేస్తున్నప్పుడు, ఎవరికి కనబడకుండా పిన్కోడ్ నెంబర్ను టైప్ చేసుకోవాల్సిందిగా తెలిపారు. కాగా అనుమానస్పద వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏటీఎం దగ్గర అనుమానస్పదంగా తిరిగే వ్యక్తులను గమనించాలని, ఏటీఎం దగ్గర మీకు సహాయం చేస్తామని ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినా వారితో అతి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు