బి ఆర్ ఎస్ వి సీనియర్ నాయకులు వొల్లాల శ్రీకాంత్ గౌడ్… జనం న్యూస్ // మార్చ్ // 20 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. విద్యారంగానికి 7.5%నిధులను మాత్రమే కేటాయించడాన్ని బి ఆర్ ఎస్ వి పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు. టిఆర్ఎస్వి సీనియర్ నాయకులు శ్రీకాంత్ గౌడ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నేడు ప్రవేశపెట్టిన 2025-2026ఆర్థిక సంవత్సర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా ఉందన్నారు.అమలుకాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం పథకాలను అమలు చేయకుండా నానా అవస్థలు పడుతున్నారు, అని గత ఎన్నికల సమయంలో విద్యారంగానికి 15%నిధులు కేటాయిస్తామని ప్రగల్బాలు పల్కి, పోయిన బడ్జెట్ లో 7.3%నిరాశ మిగిల్చి, నేడు ఈ బడ్జెట్ లో కూడా 7.5%(23,108 సీఅర్)మాత్రమే కేటాయించిందన్నారు.అభిరుద్ది, సంక్షేమం, సుపరిపాలన అని వారి నినాదాలతో ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అని కానీ వారి నినాదాలు వాస్తవానికి మాత్రం సంక్షేమనికి ఆమడ దూరం, అభివృద్ధి లో వెనుకబాటు తనం, సూపరిపాలన శూన్యం మాత్రమే చూస్తున్నామన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యారంగానికి,యూనివర్సిటీలకు, గురుకులాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అద్భుతంగా అభిరుద్ది పరిచింది అని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం యూనివర్సిటీ, గురుకులాలను నిర్లక్ష్యం చేస్తు విద్యార్థుల మరణాలకు కారణమౌతున్నాయి, అని మండిపడ్డారు. గురుకులాలలో చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను 200%, డైట్ చార్జీలు 40% పెంచుతామణి గత బడ్జెట్ లోనే అన్నారు, కానీ మళ్ళీ గతంలో మాదిరే ఇప్పుడు కాస్మోటిక్, డైట్ ఛార్జిలను 200%, 40% అంటున్నారన్నారు. అంటే గతంలో ఈ కేటాయింపులు జరగలేదా..?. మీ బడ్జెట్ నిధులు నీటి మూటలేనా..? అని ప్రశ్నించ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలు చైతన్య వంతులు, విద్యావంతులు, మేధావులు అన్నీ గమనిస్తూనే ఉన్నారు.అని తెలియజేసారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని కోరారు, విద్యారంగా సమస్యల మీద అసెంబ్లీ ముట్టడి చేసిన కూడా వైఖరి మారలేదు, అన్నారు. వందేళ్లకు పైబడి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కీ 1000 కోట్లు రాష్టంలోని అన్నీ యూనివర్సిటీ లను అభిరుద్ది చేయాలి అని , అలాగే యూనివర్సిటీ లో ఉన్న బోధన, బోధనేతర ఖాళీలను తక్షణమే భర్తీ చెయ్యాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో విద్యారంగా సమస్యలు తీరెంత వరకు బి ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో మా పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.