జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. 15 మండలాల్లో సుమారు 40 °C టెంపరేచర్ నమోదు కానుండగా.. 20 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వంగరలో 40.6°C తెగ్గాంలో 40.5°C, రామభద్రపుర, రేగిడి ఆమదాల వలసలో 40.2, మెరకముడిదాంలో 40, గజపతినగరం, రాజాంలో 39.9, గంట్యాడలో 39.7, సంతకవిటిలో 39.6, గరవిడిలో 39.5, గుర్లలో 39.3, విజయనగరంలో 38.5°C గా నమోదవుతాయి