జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో అవసరమన్నచోట్ల బడి బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం జరిగిన నిరసనలో పట్టణ అధ్యక్ష,కార్యదర్శిలు గ్. సూరిబాబు, కే. రాజు మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు బడి బస్సులు కోసం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా బడి బస్సులు సంఖ్య పెంచాలని టైంకి బస్సులో చేరాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న విధంగా విజయనగరం నుంచి రణస్థలం వరకు, విజయనగరం నుంచి సతివాడ వరకు, విజయనగరం నుంచి కుమిలి వరకు బడి బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల ముందు వరకు మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యార్థులు పక్షాన మేము ఉంటాము ఏ ఇబ్బంది ఉన్నా మాతో చెప్పండి అని అన్నారని,. ప్రభుత్వాలు అధికారానికి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న కనీసం విద్యార్థులకు సమస్యలు పట్టించుకోలేని పరిస్థితి ఉందని విమర్శించారు. కాబట్టి బడి బస్సులు సమస్యని పరిష్కారం చేయలేక పోతే ప్రభుత్వంపై విద్యార్థులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా సహా కార్యదర్శి , శిరీష , సోమేష్ , పట్టణ కమిటీ సభ్యులు శివ , గుణ, జయ, లక్ష్మి, పాల్గొన్నారు