జనం న్యూస్// జనవరి 13// జమ్మికుంట// కుమార్ యాదవ్..
సాంఘిక సంక్షేమ గురుకులాలలో ప్రవేశాలను కోరుతూ గురుకుల సొసైటీ రూపొందించిన వాల్ పోస్టర్లను జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలల బాలురు మరియు బాలికల ప్రిన్సిపాల్, సిహెచ్ లచ్చయ్య, జమ్మికుంట మరియు హుజురాబాద్ ఉపాధ్యాయులు నవీన్, శ్రీకాంత్, సునీత, మరియు పేరెంట్ కమిటీ సభ్యులు, ఎన్ రజనీకార్, ఏ సిటీ స్టాలిన్, మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ వరగంటి రవి మాట్లాడుతూ.. గురుకులాలను బలోపేతం చేయడానికి గాను తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తు, మెరుగైన విద్యా మరియు సౌకర్యాలు సమకూర్చడంలో ముందంజలో ఉంది అని పేర్కొన్నారు. కావున విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోగలరని కోరారు. ప్రిన్సిపల్ లచ్చయ్య, మరియు ఇందిర మాట్లాడుతూ.. ఈ దరఖాస్తులు చేసుకోవడానికి గానూ సర్టిఫికెట్లు జనన,కుల,ఆదాయ, ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఏదైనా గురుకుల పాఠశాలను సంప్రదించిన, దరఖాస్తు చేసుకోవడంలో వారికి సహకరించగలమని విజ్ఞప్తి చేసారు. చివరి తేదీ 1/2/2025 రోజు, ఐదవ తరగతి అడ్మిషన్లకు అన్ని బాల బాలికల గురకలాలలో మరియు ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు, సైనిక్ స్కూల్ మరియు ఇతర పాఠశాలలో బ్యాక్ లాక్ అడ్మిషన్లు కు అవకాశం కలదు అని తెలిపారు.