జనం న్యూస్ జనవరి 13
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క,కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్కతో కలిసి సోమవారం భూమిపూజ చేశారు.రెబ్బెన మండలం గంగాపూర్ లో రూ. 10 లక్షలతో వెంకటేశ్వర మందిర్ కమాన్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించారు. ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ లో రూ. 1కోటి 35 లక్షల నిధులతో బాల సదన్ హోమ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాంకిడి మండల కేంద్రంలో రూ. 19 లక్షలతో నిర్మించిన నూతన మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించారు. కిరమేరి మండలం జోడేఘాట్ లో రూ. 4 కోట్ల 95 లక్షల నిధులతో టూరిజం ప్రాజెక్టు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి,వెడ్మ బొజ్జు,జిసిసి చైర్మన్ కొట్నాక తిరుపతి, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్,కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,అధికారులు పాల్గొన్నారు.