ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద డిగ్రీ అధ్యాపకుల విస్తృత ప్రచారం…..
బిచ్కుంద మార్చి 20 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ప్రిన్సిపల్ కె అశోక్ సూచన మేరకు ఇంటర్ రెండవ సవంత్సరం పరీక్షలు నేటితో ముగిస్తున్న క్రమంలో, కాళశాల అధ్యాపక బృందాం కళాశాలలో అడ్మిషన్లు పెంపే లక్ష్యంగా ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద అడ్మిషన్లకై ప్రచారం నిర్వహించారు. రండి.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి.. అంటూ పరీక్ష కేంద్రల వద్ద ప్రచార కరపత్రాల తో ప్రచారం చేశారు. బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పిట్లం బీర్కూర్, మేనుర్ ,కంగ్టి, కేంద్రాల వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కళాశాలలోనీ గ్రూపుల వివరాలు, ఎన్ఎస్ఎస్ సర్వీసులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతన అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులకు విపులంగా వివరించారు.