జనం న్యూస్ 21 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు అసెంబ్లీ బడ్జెట్ సమావేశలు జరుగుతున్న నేపథ్యంలో ఆశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల కనీస వేతనం అమలు అయ్యేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో బిల్లు ప్రవేశ పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు కలెక్టర్ కార్యాలయల ముందు ఉదయం నుండే జిల్లా అధికారుల విధులకు వెళ్లకుండా గేట్లను నిర్భదం చేసిన వైనం సందర్బంగా
వారికీ మద్దతుగా BRS పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రకటించి మాట్లాడుతూ..కచ్చితంగా ఆశలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ను డిమాండ్ చేసారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశలకు గౌరవ వేతనం 9700/- ఇచ్చిన ఘనత వారిది.మోసపూరితమైన మాటలు చెప్పి మేము అధికారంలోకి వస్తే మీకు 18,000 జీతం ఇస్తామని మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఈరోజు మాట మార్చడం సిగ్గుచేటని విమర్శించారు. తక్షణమే వారికి ఇచ్చిన మాట ప్రకారం హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.