జనం న్యూస్ జనవరి 13 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని పద్మావతి నగర్ లో గల శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత నెల నుండి ఇప్పటివరకు ధనుర్మాస పూజలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ధనుర్మాస పూజలలో భాగంగా శ్రీశ్రీశ్రీ గోదాదేవి రంగనాయకులు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకులు చక్రపాణి నరసింహమూర్తి మరియు సందీప్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ వివాహ మహోత్సవాల్లో పలు గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరిగింది అని ఆలయ కమిటీ తెలిపారు.