జనం న్యూస్ మార్చి 21 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం పదవ తరగతి పరీక్షలు, ఉదయం 9:30 నుండి 12:30 వరకూ పరీక్షలునిర్వహిస్తున్నారు..పదో తరగతి పరీక్షల్లో భాగంగా పటాన్ చెరు మండలంలో 14 పరీక్ష కేంద్రాలు, ఆర్ సి పురం మండలం 07, అమీన్ పూర్ 06, జిన్నారం 02, గుమ్మడిదల 01, బొంతపల్లి 01, బొల్లారం 03, పరీక్షా కేంద్రాలలో నియోజకవర్గంలో మొత్తం34 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 7246 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు… పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసుల బందోబస్తుతో కట్టుదిట్టంగా నిర్వహించారు.