సీఎంఆర్ ఐటి కళాశాల ఆధ్వర్యంలో విజ్ఞాన విహారయాత్ర జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామ వ్యవసాయ పంట పొలాలలో శుక్రవారం సిఎంఆర్ ఐటి కళాశాల జేఎన్టీయూ హైదరాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు విజ్ఞాన విహారయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి గ్రామ వ్యవసాయ దారులతో మమేకమై ఆటపాటలతో సందడి చేశారు, అనంతరం సీఎంఆర్ కళాశాల సౌజన్యంతో వ్యవసాయదారులకు చల్లని మజ్జిగ, పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందజేశారు, ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, సీఎంఆర్ ఐటి కళాశాల ఆధ్వర్యంలో చదువుతోపాటు విజ్ఞానం సామాజిక సేవ లక్ష్యంగా విజ్ఞాన విహారయాత్ర నిర్వహిస్తూ, మారుమూల గ్రామాల్లోని రైతులతో, రైతు కూలీలతో ఒక రోజు గడపడం చాలా సంతోషంగా ఉందని ఈ నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు మాపట్ల చూపించిన ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జంగారెడ్డి సార్ , ప్రిన్సిపల్ జి మధుసూదన్ రావు, ఎస్ ధనలక్ష్మి , కోఆర్డినేటర్ విజయ, కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు