ఆర్.బి.ఎస్.కే లు వేసవి కాలంలో అంగన్వాడి కేంద్రాలలో పర్యటించాలి ఏప్రిల్ నెలలో బీ.పి, మధుమేహం వ్యాధిగ్రస్తులకు జీవన విధానం మార్పు పై అవగాహన కల్పన టి-హబ్ ద్వారా త్వరగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలువైద్య ఆరోగ్యశాఖ పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, మార్చి 22, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) జిల్లాలోని రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వైద్యారోగ్య శాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, క్షయ శిబిరం , ఏన్.సి.డి సర్వే చాలా బాగా జరిగిందని కలెక్టర్ అభినందించారు. గత 2 సంవత్సరాలుగా టీబి కేసులు నమోదు కాని గ్రామాలలో కూడా పర్యటించి టీబీ వ్యాధి లక్షణాలు గల వారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో టీబీ వ్యాధిగ్రస్తులు లేని పక్షంలో టిబి రహిత గ్రామాలను ప్రకటించాలని కలెక్టర్ తెలిపారు.క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తించేందుకు చేపట్టిన సర్వే విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఎన్.సి.డే సర్వే ద్వారా జిల్లాలో గుర్తించిన బిపి, మధు మేహాం వ్యాధిగ్రస్తులకు ఏప్రిల్ నెలలో జీవన విధానంలో చేసుకోవాల్సిన మార్పుల పై ఏఎన్ఎం ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.వేసవి కాలంలో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఉన్న నేపథ్యంలో ఆర్.బీ.ఎస్.కే బృందాలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ అక్కడి పిల్లల ఎదుగుదలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. రాబోయే వేసవి కాలంలో వడ గాల్పుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వడదెబ్బకు ప్రజలు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు ప్రచారం చేయాలని అన్నారు.రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వైద్య శాఖ అధికారులు స్థానిక మున్సిపల్ గ్రామపంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రిలో అందే పాలాటివ్ కేర్ సేవలను అవసరమైన రోగులు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.రోగులకు డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు అందించడంలో పెద్దపెల్లి జిల్లా ముందు ఉందని అన్నారు. డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా ప్రస్తుతం 6 గంటల 20 నిమిషాల వ్యవధిలో మనం ఫలితాలు అందిస్తున్నామని, దీనిని మరింత తగ్గించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పరీక్ష నమూనాలు టీ-హబ్ కు త్వరగా చేరుకునేలా రవాణా వ్యవస్థ రీ ఆర్గనైజ్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆరోగ్యశాఖ పరిధిలో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.