ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 21: మండలంలోని ఏన్కూర్, తిమ్మారావుపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో శుక్రవారం టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏన్కూర్ లో 203 మంది విద్యార్థులు, తిమ్మారావుపేటలో 63 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ రెండు పరీక్ష కేంద్రాలను స్క్వాడ్ బృందం సభ్యులు ఝంకిలాల్ తనిఖీ చేశారు. సిఎస్ లుగా రహీంబి, సుభాషిణి, డివోలుగా ఎం పుల్లయ్య, జే పుల్లయ్య వ్యవహరిస్తున్నారు.