జనం న్యూస్ మార్చి 22, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆశ వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు ఉమాదేవి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆశ వర్కర్ల పనిని గుర్తించి,పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అన్నారు . గ్రామాలలో ఆరోగ్యపరమైన సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లకు నెలకు 26, వేల రూపాయలు చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు అమృత, మానెమ్మ, లక్ష్మి, అండాలు, చంద్రకళ,ఇంకా అన్ని గ్రామాల ఆశలు మరియు తదితరులు పాల్గొన్నారు.