ఏజెన్సీ ప్రజలతో నాకు విడదీయలేని సంబంధం ఉంది
రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు..
జనం న్యూస్ జనవరి 13 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ :
రంపచోడవరం నియోజవర్గం, ఏజెన్సీ గిరిజన ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. రంపచోడవరం మండలం కాకవాడ గ్రామంలో తున్నూరు యూత్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మెగా టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రంపచోడవరంలోని గిరిజన ప్రజలకు తనకు చిన్ననాటి నుంచి విడదీయలేని సంబంధం ఉందన్నారు. గిరిజన ప్రజల అభివృద్ధికి, నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అలాగే క్రీడలు ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎంతో ఘనంగా నిర్వహించుకుందామని, దానికి కావలసిన సహకారం అందిస్తానన్నారు. దేవాలయాల అభివృద్ధికి, పేదలకు, నిత్యం సేవా కార్యక్రమలు నిర్వహిస్తూనే ఉన్నామన్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలని లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాలు కావలసిన ప్రతి వనరులను సాధించడం కోసం ముందుండి తాను నడుస్తానని తెలిపారు.ఇప్పటివరకు గిరిజన గ్రామాల్లో ఎవరు చేయలేని అభివృద్ధిని తాను చేసి చూపిస్తానని అన్నారు. ఏజెన్సీలోని చాలా ప్రాంతాలలో దేవాలయాల అభివృద్ధి, విద్య వైద్య ఆర్థిక పరంగా సహాయం చేయడం జరిగిందన్నారు.. మొత్తం ఈ టోర్నమెంట్ లో 24 జట్లు పాల్గొనగా ఫైనల్ లో విన్నర్ గా రాకోట టీం, రన్నర్ గా దబ్బవలస టీమ్లు గెలుపొందాయి. విజేతలకు ట్రోపీలు అందజేసి విన్నర్స్ కు 22,500, రూపాయలు, రన్నర్స్ కు 15000 వేలు రూపాయలు నగదును కంబాల శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న దొర, తామర్ల రాంబాబు, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ, కట్టా కళ్యాణ్, గ్రామస్తులు యువత పాల్గొన్నారు.