జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లా 23-3-2025 ఆదివారం " ప్రతినిధి నాగరత్నం"
జోగిపేట పట్టణం లో ముదిరాజ్ సంఘం కు చెందిన మహిళా సోదరి శ్రీమతి" ఖదిరాబాద్ లచ్చమ్మ " గత రెండు సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో స్వర్గస్తులైనారు, ఈ విషయాన్ని తెలుసుకున్న జోగిపేట్ మున్సిపాలిటీ మూడో వార్డు బి ఆర్ఎస్ నాయకులు జిన్నా విజయ్ కుమార్ మృతిచెందిన ఖదిరాబాద్ లచ్చమ్మ ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది, ఆమె మృతికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు జిన్నా విజయకుమార్ పక్షాన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు,ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నామన్నారు, ఈ కార్యక్రమంలో తుపాకుల సునీల్ కుమార్, ఉలువల వెంకటేశం, పిట్ల లక్ష్మణ్, రాజు, జోగయ్య మరియు జగ్గు తదితర ముదిరాజ్ సంఘo సభ్యులు కాలనీకి చెందిన పెద్దలు పాల్గొన్నారు.