జనం న్యూస్ 13జనవరి కోటబొమ్మాళి మండలం: మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం బోగి మంటలు వెలుతురులతో గ్రామాలు కళకళలాడాయి. ఈ పండుగ నాడు తెల్లవారు జామునే యువకులు, పెద్దలు కలసి వీధుల్లో బోగిమంటలు వేశారు. యువకులు ఈ పండుగ కోసం గత వారం రోజులు ముందుగానే కట్టెలు, పిడకలు సేకరించి, ఈ బోగిమంటలో వేశారు. మహిళలైతే ఉదయాన్నే తలస్నానం చేసి కొత్తబట్టలు ధరించి బోగి దండలను మంటలో వేసి భక్తి శ్రద్దలతో నమస్కరిస్తారు. మండలంలో గల ఊడికలపాడు, కోటబొమ్మాళి, దంత, కురుడు, హరిశ్చంద్రపురం, లఖందిడ్డి, గంగరాం, యలమంచలి, పాకివలస, శ్రీజగన్నాధపురం, నిమ్మాడ, తిలారు తదితర గ్రామాల్లో ఘనంగా బోగి పండగ నిర్వహించారు. అలాగే స్థానిక శ్రీ కొత్తమ్మతల్లి ఆలయంలో ఆలయకార్యనిర్వాహాణాధికారి వాకచర్ల రాధాక్రిష్ణ ఆద్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు బోగి మంటలు, మగ్గులు వేసి, గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి సందడిగా గడిపారు.