జనం న్యూస్, మార్చి 23, (బేస్తవారిపేట ప్రతినిధి)
ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గంలో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి మాత్రమే అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు, బేస్తవారిపేట మాజీ మండల కన్వీనర్ "బొల్లా బాలిరెడ్డి" ఓ ప్రకటనలో తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికలలో "త్రుటిలో" విజయం చేజారి పోయినప్పటికీ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహ పడకుండా ప్రస్తుత గిద్దలూరు నియోజక వర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుందురు నాగార్జున రెడ్డి వెంట నడుస్తున్నారని తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో కొంతమంది నాయకులు కొన్ని అపోహలు సృష్టిస్తున్నారని, ఆ అపోహలను ఎవరు నమ్మొద్దని 2029 న జరిగే సార్వత్రిక ఎన్నికలలో కుందురు నాగార్జున రెడ్డిని గెలిపించుకునే బాధ్యత మన అందరిపై ఉందని "బొల్లా బాలిరెడ్డి" ఓ ప్రకటనలో తెలిపారు.