జనం న్యూస్ మార్చి 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్
మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో డివైఎఫ్ఐ మరియు కెవిపిఎస్ ఆధ్వర్యంలో.. భగత్ సింగ్ 94 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు,డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వట్టెపు చిన్న
సైదులు మాట్లాడుతూ..విప్లవం వర్ధిల్లాలి నినాదంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్, తాను మరణిస్తే వేలమంది భగత్ సింగ్ లు పుట్టుకొస్తారన్న ధైర్యశాలి అని కొనియాడారు.ఎందరో స్వాతంత్ర సమరయోధుల బలిదానం ఫలితంగా మనం స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మామిడి గురుమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కామల్ల ప్రసాద్, యూత్ సభ్యులు వట్టెపు నరేష్, పిల్లి పృద్వి, విజయ్, మను, తదితరులు పాల్గొన్నారు..