జనం న్యూస్ -మార్చి 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-
అంతర్జాతీయ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాగార్జునసాగర్ లోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ మరియు టెస్టింగ్ సెంటర్ లో ( సమీకృత సేవ మరియు పరీక్షా కేంద్రం) ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మంగళగిరి అంజయ్య ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జిల్లా టీబీ నివారణ అధికారి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కృష్ణకుమారి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగ సేవ అవార్డును అందుకున్నారు. అంజయ్యకు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి సుపరిండెంట్ డాక్టర్ హరికృష్ణ మరియు వైద్య బృందం అభినందించారు