ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 24:
ఏన్కూర్ మండల పర్యటనలో భాగంగా వైరా మాజీ శాసనసభ్యురాలు జూలూరుపాడు మరియు ఏన్కూర్ మండలంలోని సీతారామ ప్రాజెక్టు కెనాల్ ను పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో, గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రాజెక్ట్ పనులు పూర్తికాకముందే నీటి విడుదల అని హడావిడి చేసిన ప్రభుత్వం, రెండు రోజుల వ్యవధిలోనే నీటిని ఆపేసి రైతులకు వ్యవసాయానికి నష్టం వాటిల్లే విధంగా ప్రభుత్వ వైఖరి నిర్వహించింది. మరింత నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులను త్వరతగతిన పూర్తిచేయాలని, భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని, రైతులకు, వ్యవసాయానికి నీటిని అందించి నష్టం కలగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన కేసీఆర్ నాయకత్వంలో, వైరా నియోజకవర్గ ఆడబిడ్డగా బానోత్ చంద్రావతి అనే నేను ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భుక్యా వినోద్ కుమార్, ఇటుకల రాజు, యూత్ ప్రెసిడెంట్ షేక్ బాజీ, ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ చాంద్ పాషా, మండల నాయకులు భూక్య ధర్మానాయక్, నరేష్, శ్రీనివాస్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.