జనం న్యూస్ మార్చి 24(నడిగూడెం)
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నడిగూడెం గ్రామానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, డివిఎంసిసి టీం సభ్యులు మునగలేటి వెంకన్న కుటుంబ సభ్యులకు డివిఎంసిసి క్రికెట్ క్రీడాకారులు 24 వేల రూపాయల ఆర్థిక సహాయంను ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. సోమవారం నడిగూడెం మండల కేంద్రంలో మృతుడి నివాసంలో జరిగిన దిశ దన కర్మలో మాజీ సర్పంచ్ దున్న సుధాకర్, డివిఎంసిసి వ్యవస్థాపకులు దున్న శ్రీనివాస్ లు క్రీడాకారులతో కలిసి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడు వెంకన్న డివిఎంసిసి క్రికెట్ జట్టు క్రీడాకారుడుగా ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా అనేక పోటీలలో పాల్గొని మంచి బౌలర్ గా పేరు సంపాదించుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ క్రికెట్ క్రీడాకారులు చక్రవర్తి, దున్న సురేష్, పాతకోట్ల నాగరాజు, పల్లపు నాగేశ్వరరావు, పాతకోట్ల ప్రకాష్, కలకొండ సృజన్, ఏపూరి సుధీర్ కుమార్,దున్నా ప్రవీణ్,పాతకోట్ల రవి, గ్రామస్తులు దున్నా లింగయ్య,వల్లెపు శ్రీను, దేవరంగుల వీరన్న, పల్లపు తిరుమలేష్, కుటుంబ సభ్యులు అజయ్, విజయ్, క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.