జనం న్యూస్ మార్చి 23(నడిగూడెం)గ్రామాలలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని గ్రామీణ వైద్యులకు తెలంగాణ ఆర్ యం పి &పి యం పి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పుప్పాల లక్ష్మి నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బ్రహ్మం సూచించారు. ఆదివారం మండల అధ్యక్షుడు శ్రీరాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు లేకపోతే గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితి పట్టించుకునేవారు ఉండనన్నారు. అనంతరం కోదాడ సీనియర్ డాక్టర్ బద్దిగాం రామకృష్ణారెడ్డి కి సంతాప సూచికంగా మౌనం పాటించారు, అలాగె గ్రామాలలో చేస్తున్న సేవలనుకొనియాడారు. గ్రామీణ వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు...ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సరికొండ నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి షేక్ సైదులు, మండల సీనియర్ వైద్యులు తన్నీరు సత్యనారాయణ, దున్నా వీరబాబు, కందాల కృష్ణ, కామళ్ళ ప్రభాకర్,సైదులు, నాగేశ్వరరావు, గురుస్వామి, గోలి వెంకన్న, కనకరత్నం పాల్గొన్నారు