జనం న్యూస్ జనవరి 14 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.రైతు నూతన మార్కెట్ విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం మద్దూరు అంబేడ్కర్ విగ్రహం ఎదుట అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ఆధ్వ ర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు. మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా రైతు నూతన మార్కెట్ విధానం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి.నెలకొందన్నారు. ఇందుకు నిరసనగా కేం ద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండా నర్సింహులు, మండలాధ్య క్షుడు ఊషప్ప, నాయకులు వెంకటయ్య, నర్సిం హులు, సాయప్ప, రాములు, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.