జనం న్యూస్ 26 మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )
బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గా తడికల శివకుమార్ ను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ నియమించారు. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమీక్షా సమావేశానికి ముఖ్య అథిది గా హాజరైన ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
కొత్తగూడెం పట్టణం లోని లేపాక్షి హోటల్ మీటింగ్ హాల్ లో సోమవారం నాడు జరిగిన కార్యక్రమం ద్వారా ఈ నియామకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్సిఎస్టిబిసి మత మైనారిటీల రాజ్యాంగ హక్కులు ప్రమాదంలో ఉన్నాయని, వారి హక్కులకు బిఎస్పీ రాజ్యాంగ రక్షణ, అమలు పోరాటం బాసటగా ఉంటుంది అని తెలియజేశారు. ప్రజాస్వామ్య శక్తులన్నీ రాజ్యాంగ రక్షణ కొరకు బిఎస్పీ తో కలసి రావాలని పిలుపునిచ్చారు. నూతనంగా జిల్లా అధ్యక్షుడు గా నియమించ బడిన తడికల శివకుమార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ , పార్టీ కల్పించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకుని,పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సంధర్భంగా నూతనంగా జిల్లా అద్యక్షుడిగా నియమించ బడిన తడికల శివకుమార్ మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అద్యక్షులు మందా ప్రభాకర్ కి కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తిమేరకు కృషి చేస్తానని అన్నారూ.ఈ కార్యక్రమం లో జిల్లా పరిధిలో ని బిఎస్పీ నాయకులు పాల్గొన్నారు.