జనం న్యూస్ 26 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం కడుమూరు గ్రామంలో కీ॥శే॥ మొర్రి పెద్ద లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్ధం గా శ్రీమతి & శ్రీ మొర్రి సరిత, చిన్న బందయ్య గ్రామంలో (మినరల్ వాటర్) చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొర్రి చిన్న బందయ్య మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో గ్రామంలో ఏ సమస్య ఉన్న తమ సమస్య అనుకోని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో విట్టలయ్య, వెంకటేష్, సుక్కయ్య, నర్సిములు, సుక్కయ్య, నరేష్, బాలకృష్ణయ్య, రమేష్, రామచంద్రయ్య, మైసయ్య, రమేష్, రాజు, మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.