హుజురాబాద్ నియోజకవర్గ పెట్రోల్ బంకులన్నింటికీ, తిరుగుతూ తెలియజేస్తున్న పూదారి రేణుక శివకుమార్..
జనం న్యూస్ // మార్చ్ // 26 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట )
కన్న తల్లుల కడుపుకొతను, కట్టడి చేయండి, కనుకరించండి, ప్రియమైన తల్లిదండ్రులారా! పెట్రోల్ బంక్ యజమానులారా! పెట్రోలును రిటల్ గా అమ్ముతున్న చిరు వ్యాపారులారా! చిన్న పిల్లలు బైక్ నడపడం విషయం లో పెట్రోల్ ఇవ్వద్దు అని హుజురాబాద్ నియోజకవర్గం పెట్రోల్ బంక్ అన్నింటికీ తిరుగుతూ ప్రాదేయపడ్డారు.పూదరి రేణుక శివకుమార్ గౌడ్,..చిన్న పిల్లలు అనగా బైక్ స్కూటీ ఇతరములు నడిపే అర్హత లేనివారు పెట్రోలు గురించి మీ పెట్రోలు బంక్ కు లేదా మీ కిరాణా షాప్ పెట్రోలు వద్దకు వచ్చినట్లు అయితే దయచేసి పెట్రోలు ఇవ్వకండి, వారి వివరాలు తెలుసుకొని వారి ఇంటిలో పెద్దవారికి తెలియచేయండి,అని అన్నారు. మీరు మంకెందుకులే వ్యాపారమే కదా అనుకుంటే మీరిచ్చే పెట్రోలు వల్ల వారి బావి ఆశలు ఆవిరి అయి కాలి బూడిద, అయ్యో ప్రమాదం ఉన్నదని గమనించండి. అన్నారు.తెలిసి తెలియని వయస్సులో సెల్ ఫోన్ లో బైక్ రైడ్ చూసి, రోడ్ పై ఆకాతాయిలు చేసే బైక్ విన్యాసలు చూసి మైనర్ పిల్లలు మేము కూడా చేయాలనే అర్ధం లేని ఆవేశం లో ఎంతో మంది తల్లులకు కడుపుకొతను బహుమతిగా ఇచ్చి వారి దారిన వారు వెళ్లి పొగ, కన్నందుకు తల్లిదండ్రులు ఇరువురు జీవితాంతము పిచోళ్లుగా, మానిషిగా రోగులుగా మిగిలిపోతున్నారు. అని తెలిపారు.కొంత మంది తండ్రులే తమ కూతురుకు, కొడుకుకు మైనర్ ల వెనుకాల బైక్ పై కూర్చొని పైచాచిక ఆనందాన్ని పండుతున్నారన్నారు. ఇది సరియింది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నాలుగు ఐదు సమవత్సరాల క్రితము నాకు తెలిసిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన కొడుకు మైనర్ అని తెలిసి తనను బైక్ పై బస్ స్టాప్ వద్ద వదిలిపెట్టి రమ్మని అనగా ఆ పిల్లవాడు తండ్రిని దిగబెట్టి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు లారీ క్రింద పడి చనిపోగా తల్లిదండ్రులు ఇప్పటికి కోలుకోలేదు.అని వివరించారు. చెప్పుకుంటూ పోతే చాలా మంది తల్లిదండ్రులు వారి వారి పిల్లలను రోడ్ యాక్సిడెంట్ లో కొల్పియినారు, అని బాధపడ్డారు.ఒక కొడుకును కొల్పియిన కుటుంబానికి మనము ఎలాంటి భరోసా ఇచ్చిన ఆ కొడుకు లోటును పొడ్చాలెమనే విషయంను అందరము గమనించాలి అని తెలిపారు. రోడ్ పై మైనర్ ల వద్ద ఏదైనా స్కూటీ లేదా మోటార్ సైకిల్ కనబడితే లాగేయండి వారి తల్లిదండ్రులకు అర్ధం చేయించండి. సమాజం లో మనందరి భాద్యత దీనికి ఎవ్వరో భాద్యులు కారు మన మందరము భాద్యులమే. ముఖ్యంగా తల్లిదండ్రులరా! మీరే ఆలోచించండి, మీ పిల్లలు పెరిగి పెద్దయ్యాక బైక్, కార్లు అన్ని నడుపావచ్చు ఇప్పుడే ఏమి తొందర ఆలోచించండన్నారు. మైనర్ బైక్ నడుపుట వలన మైనర్ కుటుంబానికే నష్టం కాదు ఒక్కోసారి ఎదుటి వారికి కూడా మైనర్ బైక్ నడుపుట వలన తీవ్ర నష్టం జరుగుతుందనే విషయాన్ని ఆలోచించుమని ప్రాడేయపడుతున్న, అని ఒక తల్లిగా నా మనస్సు తట్టుకోలేక పోతుందన్నారు.అందుకే సమాజములో ఉన్న వయోజనులైన అందరిని మైనర్ లు బైక్ నడుపకుండా భాద్యత తీసుకుందామని, భవిష్యత్ లో ఏ తల్లి కూడా కడుపు కోతతో జీవితాంతం శిక్ష అనుభవించకుండా ప్రతిజ్ఞ తీసుకోవాలని భీవిష్యత్ తరాలకు మంచిని పంచుదామని, వారి భాద్యతలను గుర్తుచేద్దామని మనస్ఫూర్తిగా మీ అందరిని భాగస్వాములు కావాలని కోరుకుంటూన్నా అని పూదరి రేణుక-శివ కుమార్, జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అన్నారు.