బిచ్కుంద మార్చి 27 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై కేసు నమోదు అయినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు ఇందులో భాగంగా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన శ్రీరామ్ వీర్ కుమార్ తండ్రి బాలయ్య, పడగల లక్ష్మణ్ తండ్రి వీరయ్య, ఎన్ వర్ అశోక్ సార్, తండ్రి కిష్టయ్య అనువారు అధిక వడ్డీలకు ప్రామిసరీ నోటీస్ పైన లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కుదువ పెట్టుకుని పేదవాళ్లకు డబ్బులు ఇస్తూ మోసం చేస్తున్నారని నమ్మదగిన సమాచార మేరకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు వారి ఇండ్లలో సోదాలు చేసి వారి దగ్గర ఉన్న అధిక వడ్డీలకు ఇస్తున్న పేపర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అధిక వడ్డీలకు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామన్నారు