జనం న్యూస్ జనవరి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసినందుకు ఎక్కడ ధర్నాలు చేపడతారని భయంతోనే ప్రభుత్వం సంక్రాంతి పండుగ రోజున ఇంటికి పోలీసులను పంపించి హౌస్ అరెస్ట్ చేయడం సరైన పద్ధతికాదన్నారు. రంగారావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి వాళ్ల సొంత ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ ని రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి పార్టీ ఫిరాయించారని మీరు ఏ పార్టీలో ఉన్నారని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టి అతనిని అరెస్టు చేశారు ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇది ప్రజల పాలన కాదు ముమ్మాటికి పోలీసుల రాజ్యం గా ఉందని అన్నారు.