జనం న్యూస్ // మార్చ్ // 27 // జమ్మికుంట// కుమార్ యాదవ్..
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా, కబ్రస్థాన్ లను గురువారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ.. రానున్న రంజాన్ ఉపవాసాల అనంతరం ముస్లిం సోదరులు నమాజ్ చేసేందుకు వచ్చే ఈద్గా ప్రాంతాన్ని రంజాన్ నమాజ్ అనంతరం పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లడానికి కబ్రస్థాన్ లలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను పారిశుద్య కార్మికులతో శుభ్రం చేయించామన్నారు. ఈద్గా, కబ్రస్థాన్ లలో ప్రహరీ గోడలకు, ఈద్గా ప్రదేశంలో రంగులు వేసి సర్వంగాసుందరంగా అలంకరించినట్లు ఆయన తెలిపారు. కమిషనర్ మహమ్మద్ అయాజ్ వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందం, పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.