రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు
జనం న్యూస్ మార్చ్ 28 జిల్లా బ్యూరో ఇంచార్జి:ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు అన్నారు. ఎస్సి ఎస్టీ కమిషన్ బృందం ఆదిలాబాద్ జిల్లా లో పర్యటించిన సందర్బంగా రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్య ని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా ఎస్సి ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం అందించడంలో వేగ వంతంగా చర్యలు చేపట్టాలని,రోజు రోజు కు దళిత, గిరిజన మహిళ లపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగి పోతున్నాయని వీటిని నిర్ములించడానికి కృషి చేయాలని అన్నారు.ఎస్సి ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించిన ప్రతి దళిత గిరిజనులకు న్యాయం జరిగేలా కమిషన్ కృషి చేయాలని కోరారు.