

….విజయం సాధించాలి
-నేనే మంచి ఉదాహరణ
-బిసి కమిషన్ మెంబెర్ బాల లక్ష్మి
చదువులతో జీవితంలో వెలుగులు
-ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ శివారెడ్డి
సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి
-ప్రముఖ వక్త సజయ
జనం న్యూస్ ;28 మార్చ్ శుక్రవారం సిద్దిపేట నియోజోకవర్గ ఇన్చార్జి సిద్దిపేట :మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర బిసి కమిషన్ మెంబెర్ బాలలక్ష్మి అన్నారు.గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అట్టడుగు వర్గాల సమానత్వం సమ్మిళిత అభివృద్ధి అంశంపై నిర్వహించిన రెండు రోజుల సెమినార్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు . మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే విజయం సాధ్యమవుతుందని చెప్పారు. అందుకు తాను మంచి ఉదాహరణయానీ చెప్పారు. ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి వెళ్లేందుకు కృషి చేయాలన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయం సాధించాలని చెప్పారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ శివారెడ్డి మాట్లాడుతూ చదువులు జీవితంలో వెలుగులు నింపుతాయని చెప్పారు. చదువుతో ఆ కుటుంభం జీవనం విధానం మారుతుందని చెప్పారు. అట్టడుగు సమాజం ఇంకా అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళ్లాలి అన్నారు.
ముఖ్య వక్త సజయ మాట్లాడుతూవిద్యార్థులు పరిస్థితులు అర్థం చేసుకొని సమాజం పట్ల అవగాహనను పెంచుకోవాలని చెప్పారు విద్యార్థులు ఫోన్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రుల కలలను నెరవేర్చేందుకు పట్టదలతో చదవాలని చెప్పారు తల్లిదండ్రులు అంతే బాధ్యతతో వ్యవహరించి పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సమాజం పట్ల అవగాహన పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగాలని చెప్పారు సాంఘిక స్పృహను కలిగి ఉండి అన్ని అంశాల పట్ల స్పందించాలని చెప్పారు చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా అధికారి రాము మాట్లాడుతూ చిన్నపిల్లల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు శారీరక మానసిక హింసకు గురవుతున్న పిల్లల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు చిన్నపిల్లలు లైంగిక దాడులకు బలవుతున్నారని చెప్పారు చిన్న పిల్లలను శారీరకంగా హింసకు గురి చేస్తూ వారి చేత బెగ్గింగ్ తదితర కార్యక్రమాల నిర్వహిస్తూ దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని చెప్పారు ఎవరైతే బాధపడుతున్న చిన్నారులను తమకు అప్పగించాలని వారికి విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు తమ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని చెప్పారు . థర్డ్ జెండర్ ముద్రబోయిన రచన మాట్లాడుతూ తాము సమాజంలో గుర్తించబడాలని చెప్పారు. అ దిశగా ప్రయత్నం జరగాలన్నారు. చదువు ద్వారా అభివృద్ధి చెందగలమని చెప్పారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ మంచి కార్యక్రమం నిర్వహించిన డా. శ్రద్ధానందం ని అభినందించారు. హుస్సేన్ మాట్లాడుతూ సమాజంలో విద్య ద్వారానే సమ సమాజ స్థాపన జరుగుతుందని చెప్పారు అట్టడుగు వర్గాల విద్యార్థులు బాగా చదివి ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగాలన్నారు తాను సిద్దిపేట డిగ్రీ కళాశాల అధ్యాపకుని స్థాయి నుంచి ప్రిన్సిపాల్ గా మెదక్ లో పనిచేస్తున్నట్లు చెప్పారు అధ్యాపకులు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి గొప్ప వ్యక్తులుగా ఎదగాలని చెప్పారు ఈ రెండు రోజుల సెమినార్ విద్యార్థుల్లో మార్పు తీసుకొస్తుందని చెప్పారు డాక్టర్ గోపాల సుదర్శనం మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో లోటుపాట్లు తొలుగుతాయని చెప్పారు సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు ఈ సందర్భంగా మ్యాజిక్ రమేష్ తన ఇంద్రజాల ప్రదర్శన ద్వారా విద్యార్థులు అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు ప్రయాణించే విధానాన్ని వివరించిన ప్రదర్శన అందర్నీ ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో